దృష్టీ 🔁 శ్రుష్టి

A Heard song at the age of  9 which make me think on the eyes of the society 

 By Sai Yadav | Tech • Life • Experience • Motivation

దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టని విన్నాను

నువ్వది వాదం అన్నావు, నేనది వేదం  అన్నానూ


దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టని విన్నాను

నువ్వది వేదం అన్నావు, నేనది వాదం అన్నానూ


సంత నడుమ ఒక జోలెపట్టి పసిగొంతు మ్రోగుతుంటే

నువ్వది గేయం అన్నావు, నేనది గాయం అన్నానూ


బల ప్రదర్శన కోసం ఒక్కడు పులిని చంపుతుంటే

నువ్వది శౌర్యం అన్నావు, నేనది క్రౌర్యం అన్నానూ


కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే

నువ్వది వినోదమన్నావు, నేనది ప్రమాదమన్నానూ


అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటే

నువ్వది కంకణమన్నావు, నేనది సంకెళ్ళన్నానూ


నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే

నువ్వది మరణం అన్నావు, నేనది జననం అన్నానూ


దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టని విన్నాను

నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నానూ

Comments

Popular posts from this blog

Love Beyond the Climax

GIVE ME REASONS TAKE ME HIGHER

11 : 11 - A Year Of Writing